హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న వరల్డ్
అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా డబుల్ ధమాకా
సాధించాడు. ఛాంపియన్షిప్ ఫైనల్స్‌లోకి దూసుకువెళ్ళడమే కాక, పారిస్ ఒలింపిక్స్‌కు
కూడా క్వాలిఫై అయ్యాడు.
అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఇవాళ
క్వాలిఫయింగ్ రౌండ్ పోటీలు జరిగాయి. అందులో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా
పాల్గొన్నాడు. ఈ 25 ఏళ్ళ యువకుడు మొదటి ప్రయత్నంలోనే తన జావెలిన్‌ను 88.77 మీటర్ల
దూరం విసరగలిగాడు. ఈ సీజన్లో ఇదే నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన. అలాగే తన కెరీర్లో
నాలుగో అత్యుత్తమ ప్రదర్శన.
నీరజ్ చోప్రా ప్రస్తుతం జరుగుతున్న
అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు చేరుకోగలిగాడు. అదే సమయంలో మరో రికార్డునూ
సొంతం చేసుకున్నాడు. 2024లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్స్
పోటీలకు అర్హత సంపాదించుకున్నాడు.
ప్యారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ విండో
జులై 1న ప్రారంభమైంది. దానికోసం, జావెలిన్ త్రో ఈవెంట్‌కు నిర్దేశించిన అర్హతా
ప్రమాణం 85.5 మీటర్లు. దాన్ని నీరజ్ చోప్రా సునాయాసంగా అధిగమించాడు.
గతంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్
చోప్రా విజయం సాధించాడు. గతేడాది, అంటే 2022 జూన్ 30న స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లో
89.94 మీటర్ల దూరం జావెలిన్ విసిరి విజయం సాధించాడు.
ప్రస్తుతం వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో
గ్రూప్ ఎ క్వాలిఫికేషన్ రౌండ్లో పాల్గొన్న నీరజ్ చోప్రా, అందులో సునాయాసంగా చోటు
సాధించాడు. ఫైనల్ పోటీ లేదా మెడల్ రౌండ్‌కి అర్హత సాధించాడు. అంతేకాదు, ప్యారిస్
ఒలింపిక్స్‌కి కూడా అర్హత సాధించాడు. నీరజ్ విజయానికి దేశవిదేశాల్లోని క్రీడాకారులు
అభినందించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు