ఇంద్రకీలాద్రిపై
కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు.శ్రావణ శుక్రవారంతో పాటు
వరలక్ష్మీవత్రం కావడంతో శక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మ వారు శ్రీవరలక్ష్మీ దేవి అలంకరణలో
భక్తులను అనుగ్రహించారు.
అమ్మవారిని అనేక
వర్ణాల పూలతో సుందరంగా అలంకరించారు. దుర్గమ్మ వారికి విశేష పూజలు నిర్వహించారు.
భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఇంద్రకీలాద్రి రద్దీగా మారింది. క్యూలైన్లు
భక్తులతో నిండిపోయాయి.
సెప్టెంబర్
8న నాలుగో శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తున్నట్లు
ఆలయ అధికారులు తెలిపారు.
భక్తుల
రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. తోపులాటలు జరగకుండా జాగ్రత్తలు
తీసుకున్నారు. ప్రత్యేక
కుంకుమార్చన సేవతో పాటు, నిత్య ఆర్జిత సేవలైన ఖడ్గమాలార్చన, లక్షకుంకుమార్చన, శ్రీచక్రనవావరణార్చన, చండీహోమం, శాంతికళ్యాణం కార్యక్రమాల్లో భక్తులు
పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.