ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ తప్పులు చేసి అయినా అనుకున్నవి సాధించాడని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ చనిపోవడం వెనుక పుతిన్ హస్తం ఉందనే విమర్శలు వస్తున్న వేళ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ప్రిగోజిన్ మృతిపట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రిగోజిన్ ప్రతిభగల వ్యక్తే కానీ, ఎన్నో తప్పులు చేశాడని పుతిన్ అన్నారు. ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో చనిపోవడంపై ఆయన సంతాపం ప్రకటించారు.
వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ తనకు మూడు దశాబ్దాలుగా తెలుసని, జీవితంలో ఎన్నో కష్టసుఖాలు చూశాడని పుతిన్ వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదం జరిగే ముందు రోజే ప్రిగోజిన్ ఆఫ్రికా నుంచి రష్యాకు వచ్చాడని గుర్తుచేశారు. ప్రిగోజిన్ మృతిపై దర్యాప్తుకు ఆదేశించారు. పూర్తిస్థాయి విచారణ తరవాతే ఒక నిర్ధారణకు వస్తామన్నారు. ప్రిగోజిన్‌తోపాటు విమాన ప్రమాదంలో మరణించిన వారు ఉక్రెయిన్‌పై యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించినట్టు పుతిన్ చెప్పారు.
ప్రిగోజిన్ ఓ ప్రైవేటు విమానంలో రష్యా రాజధాని మాస్కో నుంచి సెయింట్‌పీటర్స్‌బర్గ్ వెళుతుండగా విమాన ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రిగోజిన్ సహా 10 మంది మరణించారు. వీరిలో వాగ్నర్ గ్రూపు సెకండ్ ఇన్ కమాండర్
దిమిత్రీ ఉత్కిన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా ప్రిగోజిన్ గత నెలలో తిరుగుబాటు మొదలు పెట్టి తరవాత విరమించుకున్నారు. ఆ సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రిగోజిన్ పెద్ద ద్రోహి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆ నేపథ్యంలో విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ మరణం తనను ఆశ్చర్యానికి గురిచేయలేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యానించారు. తాము ముందునుంచీ ఊహించినదే జరిగిందన్నారు.
ప్రిగోజిన్ ప్రయాణిస్తోన్న విమానంలో బాంబు పేలి ఉండవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. క్షిపణిని ఉపయోగించి ప్రిగోజిన్ ప్రయాణిస్తోన్న విమానాన్ని కూల్చివేసి ఉండొచ్చన్న అంచనాలను అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు కొట్టిపారేశాయి. ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానంలో కూలిపోవడానికి ముందే పెద్ద పేలుడు సంభవించి ఉండ వచ్చని అమెరికా అనుమానిస్తోంది. పెంటగాన్ ప్రతినిధి రైడర్ కూడా విమానంలో పేలుడు వల్లే ప్రిగోజిన్ మరణించి ఉంటారని అభిప్రాయపడ్డారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు