దక్షిణాఫ్రికాలో
జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రధాని నరేంద్రమోదీ
మధ్య సంభాషణపై డ్రాగన్ కంట్రీ వక్రభాష్యం చెప్పడాన్నికేంద్రప్రభుత్వ వర్గాలు బలంగా
తిప్పికొట్టాయి. భారత్ అభ్యర్థన మేరకే బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ-జిన్‌పింగ్
మాట్లాడుకున్నారని చైనా ఆరోపించడాన్ని ఖండించారు.
ద్వైపాక్షిక
సమావేశం నిర్వహించాలని గతంలోనే భారత్‌ను చైనా అభ్యర్థించిందని.. ఆ విషయం పెండింగ్ లో
ఉందని కేంద్రప్రభుత్వం గుర్తుచేసింది. బ్రిక్స్ దేశాల అధినేత సంయుక్త సమావేశం
అనంతరం మోదీ, జిన్‌పింగ్ మధ్య అనధికార సంభాషణ మాత్రమే జరిగిందని
తెలిపింది.
బ్రిక్స్ సదస్సు వేదిక వద్దకు వెళ్లే సమయంలో
మోదీ, జిన్‌పింగ్ మాట్లాడుకున్నారు. మీడియా సమావేశం తర్వాత కూడా క్లుప్తంగా
ముచ్చటించారు. ‘‘ సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పుదామని, తూర్పు లద్దాఖ్ లో వాస్తవాధీన రేఖ వెంట సమస్యలు పరిష్కరించుకుందామని,
అప్పుడే ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చైనా అధ్యక్షుడికి మోదీ
స్పష్టం చేశారు.
గత ఏడాది నవంబర్ లో జీ-20లో సదస్సు తర్వాత
వారిద్దరూ మాట్లాడుకోవడం ఇప్పుడే. గల్వాన్ లోయలో ఘర్షణలు, తూర్పు లద్దాఖ్ లో ప్రతిష్టంభనతో
ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల సైనికాధికారుల మధ్య
చర్చలు 19 సార్లు జరిగాయి. పరిస్థితులు మెరుగుపడి శాంతి నెలకొల్పేందుకు కృషి
చేస్తామని ఇరుదేశాల ప్రతినిధులు అంగీకరించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు