చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా
నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలను సన్మానిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి
సిద్దరామయ్య ప్రకటించారు. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ల్యాండర్‌ను, రోవర్‌ను
దిగ్విజయంగా దింపిన చంద్రయాన్ 3 ప్రయోగం జరిగిన మరునాడు, అంటే గురువారం, ముఖ్యమంత్రి
ఈ ప్రకటన చేసారు.
గురువారం సిద్దరామయ్య బెంగళూరులోని ఇస్రో
కేంద్రాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా
మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇస్రో సాధించిన ఈ ఘనత, మొత్తం ప్రపంచం దృష్టిని భారత్ వైపు
ఆకర్షించింది. చంద్రుడి మీద విక్రమం ల్యాండర్ క్షేమంగా దిగడం చారిత్రక విజయం’’
అన్నారు.
కర్ణాటక విధాన సౌధలోని
బాంక్వెట్ హాల్ ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి, ఇస్రో చీఫ్ సోమనాథ్, ఆయన
బృందంలోని కర్ణాటకకు చెందిన 500 మంది శాస్త్రవేత్తలను సన్మానిస్తామని ముఖ్యమంత్రి
సిద్దరామయ్య చెప్పారు. ఎప్పుడు సన్మానిస్తామన్న తేదీని సెప్టెంబర్ 2 తర్వాత
వెల్లడిస్తామన్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు