అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు, ఆ వెంటనే విడుదల చకచకా జరిగిపోయాయి. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జోక్యం, కుట్రలకు పాల్పడ్డారని ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు ట్రంప్ స్వయంగా అట్లాంటా జైలు అధికారుల వద్ద లొంగిపోయారు. కోర్టు నియమ నిబంధనలు పూర్తి చేసి బెయిల్‌పై ట్రంప్ విడుదలయ్యారు. అట్లాంటాలోని ఫుల్టన్ కౌంటీ జైలు అధికారులకు 2 లక్షల డాలర్ల బాండు సమర్పించి బైటపడ్డారు. సాక్షులను ప్రభావితం చేసే విధంగా సోషల్ మీడియాను ఉపయోగించడానికి వీల్లేదనే నిబంధనను కూడా కోర్టు విధించింది.
అమెరికాలోని జార్జియాలో 2020 ఎన్నికల ఫలితాల్లో జోక్యం, కుట్రల వంటి తీవ్రమైన అభియోగాలు ట్రంప్ ఎదుర్కొంటున్నారు. న్యాయ వ్యవస్థను అపహాస్యం పాలు చేశాడనే తీవ్రమైన ఆరోపణలు కూడా మాజీ అధ్యక్షుడిపై ఉన్నాయి. అరెస్ట్ సందర్భంగా తీసిన ఫొటోను ట్రంప్ ట్విట్టర్లో షేర్ చేసారు. ఆరోపణలకు భయపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.
చాలా కాలం క్రితమే ట్విట్టర్ నుంచి ట్రంప్‌ను నిషేధించారు. ఆ కంపెనీని ఎలాన్ మస్క్ టేకోవర్ చేసాక ఆ నిషేధాన్ని తొలగించారు. అయినా ఇప్పటివరకూ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ‘ట్రూత్’ను వాడుతూ ట్విట్టర్‌కు దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు జైల్లో తన ఫొటోతో ట్రంప్ చేసిన ట్వీట్, రికార్డులు సృష్టించింది. రెండే గంటల్లో సుమారు నాలుగున్నర కోట్ల మంది ఆ ట్వీట్‌ను చూసారు. రెండు కోట్ల మంది రీట్వీట్ చేసారు.
డొనాల్డ్ ట్రంప్ చేరుకున్న జార్జియా జైలు వద్ద ఆయన అభిమానులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ట్రంప్ జార్జియాలోని జైలు వద్దకు చేరుకునే ముందే ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కేసులో ట్రంప్‌తో సహా మొత్తం 19 మంది అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఈ తరహా కేసుల్లో నిందితులు పోలీసుల వద్ద తమంత తాముగా లొంగిపోయినా అరెస్టుగానే పరిగణిస్తారు. 2020 ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి కుట్రలకు పాల్పడలేని ట్రంప్ చెప్పుకొచ్చారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు