తెలుగు సినీచరిత్రలో
మొట్టమొదటిసారి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం అల్లు అర్జున్ దక్కించుకున్నారు. ‘పుష్ప:
ది రైజ్’ చిత్రంలోని తన నటనకు గాను అల్లు అర్జున్ ఈ అవార్డు గెలుచుకున్నారు.
2021లో విడుదలైన
సినిమాలకు 69వ జాతీయ జాతీయ చలనచిత్ర అవార్డులను కమిటీ ఈ సాయంత్రం ప్రకటించింది. అంతకుముందు
ఆ జాబితాను కమిటీ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు అందించింది.
జాతీయ ఉత్తమ నటి
అవార్డును ఆలియా భట్, కృతి సనన్ పంచుకున్నారు. గంగూబాయి కఠియవాడీ, మిమి సినిమాల్లో
వారి నటనకు ఈ పురస్కారం లభించింది. కేరళకు చెందిన ఇస్రో శాస్త్రవేత్త నంబినారాయణన్
జీవితం ఆధారంగా రూపొందించిన రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ జాతీయ ఉత్తమ చలనచిత్రంగా ఎంపికైంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ద కశ్మీర్ ఫైల్స్ చిత్రం జాతీయ సమైక్యతపై
ఉత్తమ చిత్రంగా నర్గీస్ దత్ అవార్డు గెలుచుకుంది. మరాఠీ చిత్రం గోదావరి దర్శకుడు
నిఖిల్ మహాజన్ ఉత్తమ దర్శకుడి పురస్కారం సాధించారు. మిమి సినిమాకు ఉత్తమ సహాయ
నటుడిగా పంకజ్ త్రిపాఠీ, కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఉత్తమ సహాయనటిగా పల్లవి జోషి ఎంపికయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా
బహుళ ప్రజాదరణ పొందిన ఆర్ఆర్ఆర్ సినిమా పలు అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ డ్యాన్స్
కొరియోగ్రఫీ అవార్డు ప్రేమ్ రక్షిత్‌కు, ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ అవార్డు కింగ్
సాల్మన్‌కు దక్కాయి. కొమురం భీముడో పాటకు గాను ఉత్తమ నేపథ్య గాయకుడు అవార్డ్
కాలభైరవను వరించింది. ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడి పురస్కారం కీరవాణికి లభించింది.
అలాగే అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం పురస్కారం కూడా ఆర్ఆర్ఆర్ దక్కించుకుంది.
కొండపొలం సినిమాలో పాటకు ఉత్తమ గేయ రచయిత అవార్డు చంద్రబోస్
గెలుచుకున్నారు. పాటలకు ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారం దేవిశ్రీ ప్రసాద్ సొంతమైంది.
తెలుగులో ఉత్తమ చిత్రంగా ఉప్పెన ఎంపికైంది.
విభాగాల వారీగా అవార్డు గ్రహీతలు
ఉత్తమ
నటుడు: అల్లు
అర్జున్ (పుష్ప)
ఉత్తమ
నటి: ఆలియా
భట్ (గంగూబాయి) & కృతిసనన్
(మిమీ)
ఉత్తమ
సహాయ నటి: పల్లవి
జోషి (ద కశ్మీరీ ఫైల్స్ – హిందీ)
ఉత్తమ
సహాయ నటుడు: పంకజ్
త్రిపాఠీ (మిమీ- హిందీ)
ఉత్తమ
దర్శకుడు: నిఖిల్
మహాజన్ (గోదావరి – మరాఠీ సినిమా)
ఉత్తమ
సంగీత దర్శకుడు (సాంగ్స్): పుష్ప- దేవిశ్రీ ప్రసాద్
ఉత్తమ
మ్యూజిక్ డైరెక్టర్ (బీజీఎమ్) : ఆర్ఆర్ఆర్- ఎమ్.ఎమ్ కీరవాణి
ఉత్తమ
ఫీచర్ ఫిలిం: రాకెట్రీ:
ద నంబీ ఎఫెక్ట్ (హిందీ)
ఉత్తమ
పిల్లల చిత్రం: గాంధీ & కో
(గుజరాతీ)
ఉత్తమ
కొరియోగ్రఫీ: ఆర్ఆర్ఆర్-ప్రేమ్
రక్షిత్
ఉత్తమ
మేకప్ ఆర్టిస్ట్:
ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి)
ఉత్తమ
స్పెషల్ ఎఫెక్ట్స్:
ఆర్ఆర్ఆర్-శ్రీనివాస్ మోహన్
ఉత్తమ
ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిహాల్ – తమిళ మూవీ)
ఉత్తమ
మేల్ ప్లేబ్యాక్ సింగర్: కాలభైరవ (ఆర్ఆర్ఆర్ – కొమురం భీముడో)
ఉత్తమ
లిరిక్స్: చంద్రబోస్-కొండపొలం
మూవీ (తెలుగు)
ఉత్తమ
యాక్షన్ డైరెక్షన్ అవార్డ్ (స్టంట్ కొరియోగ్రఫీ): ఆర్ఆర్ఆర్- కింగ్ సోలమన్
ఉత్తమ
కాస్ట్యూమ్ డిజైనర్:
వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్దామ్-హిందీ)
ఉత్తమ
ప్రొడక్షన్ డిజైన్:
దిమిత్రీ మాలిక్
& మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్దామ్)
ఉత్తమ
ఎడిటింగ్: సంజయ్
లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి మూవీ)
ఉత్తమ
ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): అరుణ్ అశోక్ & సోనూ
కేపీ (చవిట్టు మూవీ-మలయాళం)
ఉత్తమ
ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్) : అనీష్ బసు (జీలీ మూవీ- బెంగాలీ)
ఉత్తమ
ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్దామ్-హిందీ)
ఉత్తమ
స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): షాహీ కబీర్ (నాయట్టు సినిమా-మలయాళం)
ఉత్తమ
స్క్రీన్‌ప్లే (డైలాగ్ రైటర్) : ప్రకాశ్ కపాడియా & ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి)
ఉత్తమ
సినిమాటోగ్రఫీ: అవిక్
ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్దామ్ మూవీ-హిందీ)
ఉత్తమ
చైల్డ్ ఆర్టిస్ట్:
భవిన్ రబరీ (ఛెల్లో షో – గుజరాతీ సినిమా)
ఉత్తమ
ఫిలిం ఆన్ ఎన్వైర్మెంట్ కంజర్వేషన్: అవషావ్యూహం (మలయాళం)
ఉత్తమ
ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: అనునాద్-ద రెజోనెన్స్ (అస్సామీస్)
ఉత్తమ
పాపులర్ ఫిలిం ఆన్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్: ఆర్ఆర్ఆర్
ఇందిరాగాంధీ
అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మెప్పాడియన్ (మలయాళం)
స్పెషల్
జ్యూరీ అవార్డ్: షేర్
షా (హిందీ సినిమా)
నర్గీస్
దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్: ద కశ్మీరీ ఫైల్స్ (హిందీ)
భాషల
వారీగా ఉత్తమ చిత్రాలు
బెస్ట్
మీషింగ్ ఫిల్మ్: బూంబా
రైడ్
బెస్ట్
అస్సామీస్ ఫిల్మ్: అనుర్
బెస్ట్
బెంగాలీ ఫిల్మ్: కల్కొకో-హౌస్
ఆఫ్ టైమ్
బెస్ట్
హిందీ ఫిల్మ్: సర్దార్
ఉద్దామ్
బెస్ట్
గుజరాతీ ఫిల్మ్: లాస్ట్
ఫిల్మ్ షో
బెస్ట్
కన్నడ ఫిల్మ్: చార్లి
777
బెస్ట్
మైథిలీ ఫిల్మ్: సమాంతర్
బెస్ట్
మరాఠీ ఫిల్మ్: ఏక్ దా
కై ఝాలా
బెస్ట్
మలయాళ ఫిల్మ్: హోమ్
బెస్ట్
మెయిటెయిలోన్ ఫిల్మ్:
ఏక్ హోయిగీ యమ్ (అవర్ హౌమ్)
బెస్ట్
ఒడియా ఫిల్మ్: ప్రతిక్ష్య
(ద వెయిట్)
బెస్ట్
తమిళ్ ఫిల్మ్: కడైసి
వివసై (ద లాస్ట్ ఫార్మర్)
బెస్ట్
తెలుగు ఫిల్మ్: ఉప్పెన
నాన్
ఫీచర్ ఫిలింస్
బెస్ట్
నాన్ ఫీచర్ ఫిల్మ్:
ఏక్ థా గావ్ (గర్హివాలీ – హిందీ)
ఉత్తమ
వాయిస్ ఓవర్: కులదా
కుమార్ భట్టాచారి (హాథీ బందూ)
ఉత్తమ
మ్యూజిక్ డైరెక్షన్:
ఇషాన్ దీవేచా (సక్కలెంట్)
ఉత్తమ
ఎడిటింగ్: అబ్రో
బెనర్జీ (ఇఫ్ మెమొరీ సెర్వ్స్ మీ రైట్)
ఉత్తమ
ఆన్‌లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్: సురుచి శర్మ (మీన్ రాగా)
ఉత్తమ
ఆడియోగ్రఫీ(ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): ఉన్ని కృష్ణన్ (ఏక్ థా గావ్)
ఉత్తమ
సినిమాటోగ్రఫీ: బిట్టూ
రావత్ (పాతాళ్ తీ)
ఉత్తమ
డైరెక్షన్: బకుల్
మతియానీ (స్మైల్ ప్లీజ్)
ఉత్తమ
కుటుంబ కథా చిత్రం:
చాంద్ సాన్సీ (హిందీ)
ఉత్తమ
షార్ట్ ఫిక్షన్ ఫిలిం:
దాల్ బాత్ (గుజరాతీ)
స్పెషల్
జ్యూరీ అవార్డ్: రేఖా
మూవీ (మరాఠీ)
బెస్ట్
ఏనిమేషన్ ఫిల్మ్: కండిట్టుండూ
(మలయాళం)
ఉత్తమ
ఇన్వెస్టిగేటివ్ ఫిలిం:
లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్)
ఉత్తమ
ఎక్స్‌ప్లోరేషన్ ఫిలిం:
ఆయుష్మాన్ (ఇంగ్లీష్-కన్నడ)
ఉత్తమ
ఎడ్యుకేషనల్ ఫిలిం:
సిర్పంగిలన్ సిర్పంగల్ (తమిళం)
ఉత్తమ
ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్(షేర్డ్): మీతూ దీ (ఇంగ్లీష్) & త్రీ టూ
వన్ (మరాఠీ-హిందీ)
ఉత్తమ
ఎన్వైర్మెంట్ ఫిలిం:
మున్నం వలవు (మలయాళం)
ఉత్తమ
ప్రమోషనల్ ఫిలిం: వర్లీ
ఆర్ట్ (ఇంగ్లీష్)
ఉత్తమ
సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిలిం: ఇథోస్ ఆఫ్ డార్క్నెస్ (హిందీ-బెంగాలీ)
ఉత్తమ
ఆర్ట్స్ అండ్ కల్చర్ ఫిలింస్: టీఎన్ కృష్ణన్ బౌ స్ట్రింగ్స్ టూ డివైన్
ఉత్తమ
బయోగ్రాఫికల్ ఫిలిం(షేర్డ్): రుఖు మతిర్ దుఖు మహీ (బెంగాలీ) & బియాండ్
బ్లాస్ట్ (మణిపురి)
ఉత్తమ
ఎత్నోగ్రాఫిక్ ఫిలిం:
ఫైర్ ఆన్ ఎడ్జ్ (టివా)
ఉత్తమ
డెబ్యూ నాన్ ఫియేచర్ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: పాంచిక
(గుజరాతీ- డైరెక్టర్ అంకిత్ కొఠారీ)