చెస్ వరల్డ్ కప్ ఫైనల్… టైబ్రేకర్‌లో చేజారిపోయింది. అజర్బైజాన్లో జరుగుతోన్న చెస్ ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుని సంచలనం సృష్టించిన చిన్న వయస్కుడు ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు. భారత ఆటగాడు ప్రజ్ఞానంద, నార్వేకు చెందిన వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్తో పోటీ పడ్డారు. ప్రజ్ఞానంద మొదటి గేమ్‌లో తీవ్రంగా శ్రమించినా చివరకు టైబ్రేకర్‌లో ఓటమిపాలయ్యాడు.
ఫలితాన్ని నిర్ణయించే రెండో ఆటలో మొదటి పది నిమిషాల్లోనే కార్ల్సన్ పైచేయి సాధించి, చెస్ ప్రపంచ కప్ గెలుచుకున్నారు. ప్రపంచ కప్ గెలుచుకున్న వారికి రూ.90 లక్షలు, రన్నర్ అప్‌గా నిలిచిన ఆటగాడికి రూ.64 లక్షలు బహుమతిగా ఇస్తారు. తాజాగా జరిగిన ఫైనల్స్‌లో గెలిచి 30 ఏళ్ల మాగ్నస్ కార్ల్సన్ ఐదుసార్లు ప్రపంచ విజేతగా నిలిచారు.
చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో ఓడినా, 18 సంవత్సరాల ప్రజ్ఞానంద, ఉద్దండులను ఖంగుతినిపించి ఫైనల్‌కు చేరాడు. వరల్డ్ నెంబర్ 2 ఆటగాడు హికారు నకమురా, వరల్డ్ నెంబర్ 3 ఆటగాడు ఫాబియానో కరువాను ఓడించి ప్రజ్ఞానంద ఫైనల్‌కు చేరి అందరి దృష్టికి ఆకర్షించాడు. ప్రజ్ఞానంద ప్రతిభను ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ కొనియాడింది. చిన్న వయసులో అసమాన ప్రతిభ చూపి ప్రజ్ఞానంద రన్నర్ అప్‌గా నిలిచి సత్తా చాటాడని ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అభినందనలు తెలుపుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు