గ్లోబల్
సౌత్ అనేది కేవలం దౌత్యపరమైన అంశం కాదన్న ప్రధాని మోదీ, వర్ణవివక్ష,
నియంతృత్వానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడిన చరిత్రకు ప్రతిరూపమని
అభివర్ణించారు. ఉమ్మడి చరిత్ర పునాదులపై ఆధునిక సంబంధాలు కొత్తరూపు
సంతరించుకున్నాయన్నారు.
దక్షిణాఫ్రికా
రాజధాని జోహానెస్‌బర్గ్ లో జరుగుతున్న బ్రిక్స్ 15వ శిఖరాగ్ర సమావేశంలోపాల్గొన్న
ప్రధాని మోదీ.. కూటమి దేశాలతో పాటు ఇతర మిత్రదేశాలు బహుళధ్రువ ప్రపంచ నిర్మాణానికి
సదస్సు సాక్షిగా కృషి చేస్తున్నాయని ప్రశంసించారు.
ఆఫ్రికా,
ఆసియా, లాటిన్ అమెరికా దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యే అవకాశం కల్పించిన దక్షిణాఫ్రికా
అధ్యక్షుడు సిరిల్ రామాఫోసాకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. గ్లోబల్ సౌత్ పరిధిలోని
దేశాల ప్రాధాన్యాలు, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామన్నారు.
గ్లోబల్
సౌత్ కు ప్రాధాన్యం ఇవ్వడం వర్తమాన అవసరమన్నారు. అందుకే బ్రిక్స్ ను విస్తరించాలని
నిర్ణయించి కొత్త దేశాలకు స్వాగతం పలుకుతున్నామన్నారు.
మహాత్ముడు
ఆచరించిన అహింసా సిద్ధాంతం, దక్షిణాఫ్రికా పర్యటనలోనే ఉద్భవించిందని గుర్తు చేసిన
మోదీ.. గాంధీ స్ఫూర్తితో దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా స్వతంత్ర పోరాటం చేశారని కొనియాడారు.
ప్రపంచం
మొత్తం ఒకే కుటుంబమని భారత్ భావిస్తోందని, అందుకే గ్లోబల్ సౌత్ సమస్యలను ప్రధాన
స్రవంతికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. అందుకే మూడు
ఆఫ్రికన్ దేశాలతో పాటు పలు వర్ధమాన దేశాలను అతిథులుగా ఆహ్వానించామని వివరించారు.
ఆఫ్రికన్ యూనియన్ కు జీ-20లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ప్రతిపాదించినట్లు
చెప్పారు. బ్రిక్స్ విస్తరణతో బహుముఖీనమైన ప్రపంచ నిర్మాణం జరుగుతుందని
ఆకాంక్షించారు.
బ్రిక్స్ కూటమిలో మరో ఆరు దేశాలు చేరాయి. అర్జెంటీనా,
ఇథియోపియా, ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ ల సభ్యత్వం 2024 జనవరి నుంచి
అమల్లోకి వస్తుంది. ప్రస్తుత సభ్య దేశాలైన బ్రెజిల్, చైనా, భారత్, దక్షిణాఫ్రికా
ఏకాభిప్రాయంతో కూటమి విస్తరణను అంగీకరించాయి.
బ్రిక్స్
లో కొత్త దేశాల చేరికతో కూటమి మరింత బలోపేతం
కావడంతో పాటు భాగస్వామ్య దేశాల మధ్య సహకారం పెరుగుతుందని ప్రధాని
నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు