మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది. ఈ ఏడాది జనవరిలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా ఫిబ్రవరి 1, తరవాత మార్చి 31, ఆ తరవాత జూన్ 30, ఆగష్టు 31 అంటూ నాలుగు సార్లు గడువు పెంచారు. అయితే సెప్టెంబరు ఒకటి నుంచి ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని, ఇక గడువు పొడిగించే అవకాశం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇప్పటికే నరేగా పథకం కింద పనిచేస్తున్న వారిలో 90 శాతం మంది ఆధార్ అనుసంధానం చేసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది.
2023, జూన్ చివరి నాటికి 14.28 కోట్ల మంది ఉపాధి హామీ ప్రయోజనాలు పొందుతున్నారు.ఇప్పటికే 13.75 కోట్ల మంది ఆధార్ అనుసంధానం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 12.17 కోట్ల మంది, అంటే 77.81 శాతం మందిని అనుసంధానం చేసినట్టు కేంద్రం తెలిపింది. 2023 మే నెలలో 88 శాతం చెల్లింపులు ఏపీబీఎస్ ద్వారా చెల్లించారు.
ఉపాధి హామీ కార్డులు కలిగిన వారిని, అర్హులు కాదంటూ ఏపీబీఎస్ నుంచి తొలగించలేమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి గిరిరాజ్‌సింగ్ ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో తెలిపారు. ఆధార్ అనుసంధానం విషయంలో ఈశాన్య రాష్ట్రాలు బాగా వెనుకబడి ఉన్నాయని మంత్రి తెలిపారు. అసోం 42, అరుణాచల్‌ప్రదేశ్ 23, మేఘాలయ 70, నాగాలాండ్ రాష్ట్రాల్లో 37 శాతం అనుసంధానించాల్సి ఉందని కేంద్ర మంత్రి ప్రకటించారు. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి త్వరగా అనుసంధానం చేసుకోవాలని ఈశాన్య రాష్ట్రాలను కేంద్రం కోరింది.
ఢిల్లీ విమానాశ్రయ అధికారులపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం