దక్షిణాఫ్రికాలోని
జొహానెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు
చేసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్
పరస్పరం షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు. కాసేపు మాట్లాడుకున్నారు కూడా.
బ్రిక్స్ దేశాల
15వ సదస్సులో పాల్గొన్న దేశాధినేతలు ఉమ్మడి ప్రకటన చేయడానికి ముందు ఈ దృశ్యం
కనిపించింది. వారిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ నడుచుకుని వేదికపైకి వెళ్ళారు. తమకు
నిర్దేశించిన ఆసనాల వద్దకు చేరుకున్నారు.
ఉమ్మడి ప్రకటన
తరువాత కూడా వారిద్దరూ చేతులు కలుపుకున్నారు. షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు.
ఇంతకుముందు,
నవంబర్ 2022లో ఈ నాయకులిద్దరూ ఇండోనేషియాలోని బాలిలో కలుసుకున్నారు. జి20 సమావేశం
సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు జొకో విడోడో ఇచ్చిన విందులో అతిథులుగా భారత, చైనా
నేతలు పాల్గొన్నారు. 2020 ఏప్రిల్ తర్వాత వారిద్దరూ కలవడం అదే మొదటిసారి.
2020 ఏప్రిల్‌లో
తూర్పు లద్దాఖ్ వద్ద చైనా సైనికులు చొరబాటుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని భారత
సైనికులు తిప్పికొట్టారు. ఆ సందర్భంగా ఇరు దేశాల మధ్యా ఘర్షణ పూర్వక వాతావరణం
నెలకొంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా రెండు
దేశాల మధ్యా అన్ని స్థాయుల్లోనూ సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఆ ఘటన తర్వాత
సరిహద్దుల సమస్యను పరిష్కరించుకోడానికి భారత్, చైనా దేశాలు గత మూడేళ్ళలో 19సార్లు
చర్చలు జరిపాయి,
ఆ నేపథ్యంలో, రెండు
దేశాల అధినేతల మధ్యా గత మూడేళ్ళుగా ప్రత్యక్షంగా మాటలు లేవు. ఈ బ్రిక్స్ సమావేశంలో
కూడా మొదటిరోజు బ్రిక్స్ బిజినెస్ ఫోరం లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో మోదీ
మాట్లాడారు. ఆ కార్యక్రమానికి జిన్‌పింగ్ గైర్హాజరయ్యారు. తనకు బదులు చైనా
వాణిజ్య మంత్రి వాంగ్ వెంటావోను పంపించారు.
ఇక ఈనాటి సమావేశంలో మరో ఆరు దేశాలను బ్రిక్స్
కూటమిలోకి చేర్చుకున్నారు. కొత్త సభ్యుల వల్ల బ్రిక్స్ మరింత బలోపేతం అవుతుందంటూ,
ఆ దేశాలను కూటమిలోకి మోదీ ఆహ్వానించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు