బ్రిక్స్
కూటమిలో మరో ఆరు దేశాలు చేరాయి. అర్జెంటీనా, ఇథియోపియా, ఈజిప్ట్, ఇరాన్, సౌదీ
అరేబియా, యూఏఈ ల సభ్యత్వం 2024 జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుత సభ్య
దేశాలైన బ్రెజిల్, చైనా, భారత్, దక్షిణాఫ్రికా ఏకాభిప్రాయంతో కూటమి విస్తరణను అంగీకరించాయి.
దక్షిణాఫ్రికా 2010లో మొదటిసారి ఈ కూటమిలో చేరింది.
దక్షిణాఫ్రికా
అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా కొత్త దేశాల చేరిక తీర్మానాన్ని ప్రవేశపెట్టగా
సభ్యదేశాలు ఆమోదించాయి. తాజా విస్తరణతో ప్రపంచంలోని తొమ్మిది అతిపెద్ద చమురు
ఉత్పత్తి దేశాలు కూటమిలో చేరాయి. బ్రిక్స్ 15వ సదస్సు సందర్భంగా డిక్లరేషన్
ప్రకటించడానికి ముందు ఈ విస్తరణ ప్రక్రియ ప్రవేశపెట్టారు.
బ్రిక్స్
లో కొత్త దేశాల చేరికతో కూటమి మరింత బలోపేతం కావడంతో పాటు భాగస్వామ్య దేశాల మధ్య సహకారం
పెరుగుతుందని ప్రధాని నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
భాగస్వామ్య
పక్షాల మధ్య సమాచార మార్పిడి, సహకారం, సహృద్భావం కోసం కలిసికట్టుగా కృషి చేద్దామని
జోహన్నెస్‌బర్గ్ వేదికగా బ్రిక్స్ దేశాలు పునరుద్ఘాటించాయి.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు