భారత్-ఐర్లాండ్
మధ్య జరగాల్సిన మూడో టి-20 వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ను టీమిండియా 2-0
తేడాతో కైవసం చేసుకుంది. మూడో వన్డే ప్రారంభానికి ముందు నుంచి ఎడతెరిపిలేకుండా
కురుస్తున్న వర్షం శాంతించకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు
ప్రకటించారు. దీంతో కనీసం టాస్ వేయకుండానే మ్యాచ్ రద్దైనట్లు అంపైర్లు
ప్రకటించారు.
మూడు
మ్యాచ్ల సిరీస్ లో భాగంగా తొలి రెండింటిలో భారత్ విజయం సాధించింది. తొలి టీ20లో
డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 2 పరుగులు తేడాతో నెగ్గిన భారత్, రెండో టీ20లో 30
పరుగులతో విజయం సాధించింది.
సిరీస్
లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ టాప్స్కోర్ చేశారు. రెండు మ్యాచుల్లో 77
పరుగులతో టాప్ప్లేస్ లో నిలిచారు. ఐర్లాండ్ బ్యాటర్లు ఆండ్రూ బల్బిర్నీ, బ్యారీమెక్
కర్తీలు చెరో అర్థశతకం బాదారు. టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే హాఫ్ సెంచరీ
మార్క్ ను దాటారు.
అత్యధిక
వికెట్లు తీసిన బౌలర్లుగా టీమిండియా బౌలర్లు బుమ్రా, బిష్ణోయ్, ప్రసిద్ధ్
నిలిచారు. తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్ క్రెయిగ్యంగ్ మూడు
వికెట్లు తీశారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు