ఉబ్బసం వ్యాధికి ఉచితంగా చేపమందు పంపిణీ
చేసే బత్తిని కుటుంబానికి చెందిన హరినాథ గౌడ్ మరణించారు. హైదరాబాద్ కవాడీగూడలో
నివసించే హరినాథ్ గౌడ్, బుధవారం అర్ధరాత్రి దాటాక, తెల్లవారితే గురువారం అనగా
తుదిశ్వాస విడిచారు.
84 సంవత్సరాల హరినాథ గౌడ్ కొంతకాలంగా
అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత అర్ధరాత్రి పరిస్థితి అదుపు తప్పింది. ఆయన ఆరోగ్యం
క్షీణించింది. ఫలితంగా హరినాథ గౌడ్ చనిపోయారు.
బత్తిని కుటుంబం ప్రతీయేటా మృగశిర కార్తె
మొదటి రోజున ఉబ్బసానికి చేపమందు ఉచితంగా పంపిణీ చేసేవారు. ఆ మందుకు ప్రజాదరణ
బాగుండడంతో ప్రభుత్వాలు కూడా ఆ రోజుకు భారీ ఏర్పాట్లు చేసేవి. మందు పంపిణీకి
గ్రౌండ్స్ ఇవ్వడం, చేపపిల్లలు సరఫరా చేయడం ద్వారా సహకరించేవి.
కొంతకాలం క్రితం కొన్ని
హేతువాద సంస్థలు ఈ మందు సరైనది కాదనీ, దానివల్ల ఉబ్బసం తగ్గదనీ ప్రచారం మొదలు
పెట్టాయి. దాంతో, తమకు తెలిసిన పరిజ్ఞానంతో
సేవ చేయడమే ముఖ్యం తప్ప పేరు ఏదైతే ఏమిటన్న ఉద్దేశంతో… బత్తిని సోదరులు చేప
ప్రసాదం పేరుతో పంపిణీ చేస్తున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు