టీవీఎస్ వాహన షోరూంలో షార్ట్ సర్క్యూట్
కారణంగా మంటలు చెలరేగాయి. షోరూమ్ తో పాటు గోదాములోని 300కు పైగా ద్విచక్ర వాహనాలు
కాలి బూడిదగా మారాయి.
విజయవాడ జాతీయ రహదారిపై స్టెల్లా
కాలేజీ పక్కన ఈ షోరూం ఉంది. విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీవీఎస్
వాహనాలకు ఇదే ప్రధాన కార్యాలయం. దీంతో పెద్దసంఖ్యంలో బైకులను ఇక్కడ నిలుపుతారు.
ఒకే చోట షోరూం, గోదాము, సర్వీస్ సెంటర్ నిర్వహిస్తున్నారు.
గురువారం తెల్లవారుజామున షోరూంలోని
మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు రేగాయి. కొద్ది సమయంలోనే మంటలు అటు
గోదాముకు కూడా విస్తరించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మూడు
ఫైరింజన్లతో మంటలు అర్పేందుకు ప్రయత్నించారు.
ప్రీఫ్యాబ్రికేటెడ్ పద్ధతిలో
నిర్మించిన షోరూం కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయని, దానికి తోడు ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా మంటలు వ్యాపించడం వల్ల ప్రమాద
నష్టం ఎక్కువగా ఉందని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో కనీసం 300 నుంచి గరిష్టంగా
500 వరకూ వాహనాలు కాలిపోయినట్టు అంచనా.
పెట్రోలు వాహనాలను ఉంచే గోదాము
సమీపంలోనే పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను కూడా పార్క్ చేయడం, వాటిని ఛార్జింగ్ పెట్టడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని
అనుమానిస్తున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు