చంద్రయాన్-3 మిషన్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇవాళ దేశీయ స్టాక్ సూచీలు దూకుడు ప్రదర్శించాయి. సెన్సెక్స్ సూచీలు 467 పాయింట్లు లాభపడి 65752, నిఫ్టీ 132 పాయింట్ల లాభంతో 19567 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా స్పేస్ స్టాక్స్ 12 శాతం లాభాలతో దూసుకెళుతున్నాయి. స్పేస్ స్టాక్స్ ్ లిండే ఇండియా, సెంటమ్ ఎలక్ట్రానిక్స్, అవాంతల్ షేర్లు దూసుకెళ్లాయి.
ఇక బ్యాంకింగ్, ఐటీ కంపెనీల షేర్లు రాణించాయి. ఎల్ అండ్ టీ, మహీంద్రా, జెఎస్డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎన్టీపీసీ షేర్లు నష్టాలను చవిచూశాయి.
అతుల్ ఆటో కంపెనీకి చెందిన 1,40,000 షేర్లను యూరోపియన్ యూనియన్‌కు చెందిన సోషల్ జనరల్ కంపెనీ కొనుగోలు చేయడంతో 4 శాతం లాభపడ్డాయి. వాస్కాన్ ఇంజనీర్స్ కంపెనీకి రూ.606 కోట్ల అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించడంతో, ఆ సంస్థ షేర్లు 9 శాతం లాభాలను పొందాయి.
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఇవాళ సాయంత్రం ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించనుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ నిలకడగా మెరుగుపడటం, చంద్రయాన్- 3 మిషన్ విజయంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. యూఎస్ డాలరుతో రూపాయి మారకం విలువ రూ.82.47 వద్ద స్థిరంగా కొనసాగడం కూడా మార్కెట్లకు మద్దతు లభించడానికి కారణమైంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు