ఐర్లండ్‌తో
టీ20 సీరీస్ కోసం డబ్లిన్‌లో ఉన్న భారత క్రికెట్ జట్టు, చంద్రయాన్ ప్రయోగాన్ని
ఆసాంతం వీక్షించింది. భారత శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించిన క్షణాలను క్రికెటర్లు
ఉద్వేగంగా చూసారు.
స్పేస్‌క్రాఫ్ట్
ల్యాండింగ్‌ను టీమిండియా చూస్తున్న ఫొటోని బీసీసీఐ ట్వీట్ చేసింది. ‘‘చరిత్ర
సృష్టించాం. మిషన్ విజయవంతమైంది. చంద్రయాన్ 3 ప్రయోగం చేసిన ఇస్రోకు అభినందనలు’’
అని బీసీసీఐ ట్విట్టర్లో వ్యాఖ్యానించింది.
బీసీసీఐ
కార్యదర్శి జై షా ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. ‘‘ఈ చరిత్రాత్మక
క్షణాలు తరాల పాటు మార్మోగుతూనే ఉంటాయి. చంద్రయాన్ 3 విజయవంతమైన ల్యాండింగ్
సందర్భంగా ఇస్రోకు హృదయపూర్వక అభినందనలు. అపూర్వమైన నిబద్ధత, అసాధారణమైన ఘనతతో
కూడిన ఈ అద్భుతమైన ఘట్టం మనందరిలోనూ స్ఫూర్తిని నింపుతుంది.’’ అని ట్వీట్ చేసారు.
భారత
కెప్టెన్ రోహిత్ శర్మ తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. ‘‘చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని
చేరుకున్న మొదటి దేశం మనదే. మనందరికీ ఇది గర్వకారణం. ఇస్రో శాస్త్రవేత్తల కృషికి వారికి అభినందనలు’’ అని ట్వీట్ చేసారు.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లు కూడా
చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అవడాన్ని హర్షిస్తూ ట్వీట్లు చేసాయి. ఇక దాదాపు
ప్రతీ క్రికెటర్, ఇస్రోను అభినందిస్తూ తమ వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్ నుంచి శుభాకాంక్షలు
తెలియజేసారు.