అంతరిక్ష
చరిత్రలో ఇస్రో కొత్త చరిత్ర లిఖించింది. చంద్రయాన్ -3 చంద్రుడి దక్షిణ ధృవంపై
అడుగుపెట్టింది. ఈ అద్భుత విజయం పై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
చంద్రయాన్-3, చందమామపై అడుగుపెట్టడంతో శాస్త్రవేత్తలపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం
కురిపించారు. ప్రయోగం విజయవంతమైన వెంటనే ఆయన చప్పట్లతో అభినందనలు తెలిపారు. మువ్వెన్నల
జెండాను ప్రదర్శించి అమితానందం వ్యక్తం చేసిన ప్రధాని.. చంద్రయాన్ ఘనవిజయంతో తన
జన్మ ధన్యమైందన్నారు. దేశం గర్వించే మహత్తర క్షణాలు నవభారత జయధ్వానమని అభివర్ణించారు.
శాస్త్రవేత్తల కఠోరశ్రమతోనే ఈ విజయం సాధ్యమైందన్నారు.
చంద్రయాన్
-3 విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఈ
అపురూపమైన ఘనత శ్రీహరికోట నుంచి సాధించామని .. ఇది ఆంధ్రప్రదేశ్ కు
ప్రత్యేకమని సీఎం జగన్ ట్విట్ చేశారు.