యావత్ ప్రపంచం మొత్తం భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్ సురక్షిత ల్యాండింగ్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సమయంలో పలువురు ప్రముఖులు భారత్ చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌పై స్పందిస్తున్నారు. ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ కూడా తన అభిప్రాయాన్ని ఎక్స్‌లో పంచుకున్నారు. ఒక నెటిజన్ ట్వీట్‌కు స్పందిస్తూ..గుడ్ ఫర్ ఇండియా అంటూ మస్క్ ట్వీట్ చేశారు.
చంద్రయాన్-3 ప్రాజెక్టు కోసం భారత్ చేసిన ఖర్చుపై మస్క్ గతంలోనూ స్పందించారు. చంద్రయాన్-3 మిషన్ బడ్జెట్ రూ.600 కోట్లు కాగా, హాలీవుడ్ సినిమా ఇంటర్స్టెల్లార్
బడ్జెట్ రూ.1300 కోట్ల కంటే తక్కువని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుందని మస్క్ ట్వీట్ చేశారు.
తాజాగా గుడ్ ఫర్ ఇండియా అని మస్క్ చేసిన ట్వీట్‌కు కొందరు రీ ట్వీట్ చేశారు. ఇండియాకు మద్దతు తెలిపినందుకు ఆయనకు కొందరు ధన్యవాదాలు తెలిపారు. ఇస్రోతో కలసి పనిచేయాలంటూ కొందరు నెటిజన్లు మస్క్‌ను కోరారు. మస్క్ కూడా అంతరిక్ష ప్రయోగాల కోసం స్పేస్ ఎక్స్ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే.