జాతీయ
విద్యా విధానం(NEP)-2020లో
భాగంగా న్యూ కరికులమ్ ఫ్రేమ్ వర్క్(NCF)సిద్ధమైనట్లు, దానిని అనుసరించే 2024
విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలు ముద్రణ ఉంటుందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
తెలిపారు.
విద్యార్థుల
ప్రదర్శన మెరుగుపరిచేందుకు ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు నిర్వహించే సౌలభ్యం తీసుకొస్తున్నట్లు
వెల్లడించారు. అందులో మంచి మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. బట్టీ విధానానికి స్వస్తి చెబుతూ ఆయా
పాఠ్యాంశాలపై అవగాహన పెంచేలా, సాధనా సామర్థ్యాన్ని పెంచేలా పరీక్షల నిర్వహణ
ఉంటుందన్నారు.
11,
12 వ తరగతి విద్యార్థులు రెండు భాషా సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. అందులో ఒకటి
భారతీయ భాష అయి ఉండాలి. విద్యార్థుల ఆసక్తి మేరకు సబ్జెక్టులను ఎంచుకోవచ్చు.
ప్రశ్న
పత్రాల కూర్పు, జవాబు పత్రాల మూల్యాంకనం చేసే సిబ్బంది కూడా విశ్వవిద్యాలయాలు
నిర్వహించే కోర్సును పూర్తి చేయాలనే నిబంధన తీసుకొచ్చారు.
పాఠ్యపుస్తకాల
సిలబస్ ను తరగతిలో యాంత్రికంగా పూర్తి చేసే విధానానికి బదులు విద్యార్థులను విషయ
నిపుణులుగా తీర్చిదిద్దేలా నిబంధనలు అమలు చేయనున్నారు.