భారత
ఎన్నికల సంఘం ప్రచారకర్తగా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బాధ్యతలు
స్వీకరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా ఓటర్లలో చైతన్యం నింపబోతున్నారు. ఓటు హక్కు,
వినియోగం, బ్యాలెట్ విధానంపై యువతకు మార్గనిర్దేశం చేస్తారు. ఈసీ నిర్వహించే కార్యక్రమాలక సచిన్ నేషనల్ ఐకాన్
గా వ్యవహరిస్తారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈమేరకు భారత ఎన్నికల
సంఘం, సచిన్ మధ్య అధికారిక ఒప్పందం కుదిరింది.
ప్రధాన
ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్రపాండే, అరుణ్ గోయెల్
సమక్షంలో ఒప్పంద పత్రాలపై సచిన్ సంతకం చేశారు.
పలు
రంగాల్లో మేటి వ్యక్తుల్ని నేషనల్ ఐకాన్స్ గా ఈసీ నియమిస్తోంది. గతంలో పంకజ్
త్రిపాఠి, ఎంఎస్ ధోని, ఆమిర్ ఖాన్, మేరీ కోమ్ కూడా ఎన్నికల సంఘం తరఫున అవగాహన
కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
దేశంలో
ఓటర్ల సంఖ్య 94.50 కోట్లకు చేరిందని ఈసీ తాజాగా వెల్లడించింది. 1951లో మొదటిసారిగా
జరిగిన సార్వత్రిక ఎన్నికలప్పుడు నమోదైన ఓటర్లతో పోలిస్తే ప్రస్తుతం ఆరు రెట్లు
పెరిగింది.
క్రికెట్ దేవుడిగా ప్రఖ్యాతిగాంచిన సచిన్ టెండూల్కర్
తన కెరీర్ లో 200 టెస్ట్ మ్యాచ్ లు ఆడారు. ఆరుసార్లు ప్రపంచకప్ టోర్నీలో భారత్
తరఫున ఆడిన సచిన్ .. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసి రికార్డు
నెలకొల్పారు. కెరీయర్ లో 664 మ్యాచ్లు ఆడి 48.52 సగటుతో 77 కంటే ఎక్కువ స్ట్రైక్
రేట్ తో 100 సెంచరీలు, 164 అర్ధ సెంచరీలతో 34,357 పరుగులు చేశారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు