మిజోరంలో
ఘోరం జరిగింది. నిర్మాణంలోని రైల్వే వంతెన కూలిన ఘటనలో 17 మంది కార్మికులు
ప్రాణాలు కోల్పోయారు. రాజధానిఐజ్వాల్
కు 21 కిలోమీటర్ల దూరంలో రైల్వే వంతెనను నిర్మిస్తున్నారు. పని ప్రదేశంలో 35 నుంచి
40 మంది శ్రామికులు పనిచేస్తున్నారు.
ఉదయం 10 గంటల సమయంలో వంతెన కూలిపోయింది.
దీంతో శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు
వదిలారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
సంఘటనా స్థలం వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం కారణంతో పాటు సంఘటనకు
సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు