అమెరికా
అధ్యక్షుడు జో బైడెన్ సెప్టెంబర్ 7 నుంచి 10వరకు భారత్ లో పర్యటించబోతున్నారు. ఈ
విషయాన్ని శ్వేతసౌధం అధికారికంగా వెల్లడించింది. భారత్ వేదికగా జరిగే జీ-20
సదస్సులో పాల్గొని ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఉక్రెయిన్ సంక్షోభంపై కూడా
స్పందిస్తారని వెల్లడించింది.
న్యూదిల్లీ
వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు జరిగే జీ-20 సమావేశాల్లో ప్రపంచదేశాల అధినేతలు
పాల్గొంటారు. ఈ సమావేశాల నిర్వహణ బాధ్యతలను 2022 డిసెంబర్ 1 ఇండోనేషియా నుంచి మన
దేశం స్వీకరించింది.
జీ-20
భాగస్వామ్య దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లతో
పాటు, వాతావరణంలో మార్పులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తిన ఆర్థిక,
సామాజిక ప్రభావాలను తగ్గించడంపై సమాలోచనలు చేస్తారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరేన్ జీన్ పియర్
తెలిపారు.
ప్రపంచబ్యాంకు
సహా ఇతర బహుళార్థక బ్యాంకుల సామర్థ్యం పెంపు, పేదరిక నిర్మూలనపై బైడెన్ సలహాలు
ఇవ్వనున్నారు. అలాగే
జీ-20 కూటమికి భారత్ ప్రాతినిధ్యం వహించడం, ప్రధాని మోదీ చూపుతున్నచొరవపై కూడా బైడెన్
ప్రస్తావిస్తారు. అలాగే 2026లో జీ-20 సదస్సుకు అమెరికా అతిథ్యం ఇచ్చే విషయంపై కూడా
మాట్లాడతారు.
ప్రపంచంలో
అతిపెద్ద ఆర్థికశక్తులు, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల అధినేతల సమావేశమే
జీ-20 సమావేశం. ప్రపంచ జీడీపీలో 75 శాతం ఈ దేశాలదే. అలాగే ప్రపంచంలో మూడింట రెండు
వంతుల మంది ఈ 20 దేశాల్లోనే ఉంటారు.
అర్జెంటీనా,
ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ,
జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో , రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఆఫ్రికా, టర్కీ,
యూకే, యూఎస్, యూరోపియన్ యూనియన్ ఇందులో భాగస్వాములు.
అధ్యక్షుడు బైడెన్ పర్యటనకు ముందు ఉపాధ్యక్షురాలు
కమలా హారిస్ ఇండోనేషియాలోని జకార్తాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 4 నుంచి 7
వరకు ఆమె పర్యటన సాగనుంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు