రూ.5
లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ప్రభుత్వం
సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
చెప్పారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అటువంటి గుడుల నిర్వహణ బాధ్యతలు
అర్చకులు లేదా ఫౌండర్ ట్రస్టీలకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని
చెప్పారు.
రాష్ట్రంలో
రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్న గుడులు 23,600 ఉన్నాయని, వాటిలో 37 దేవాలయాలు మాత్రమే స్వీయ నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకున్నాయని మంత్రి తెలిపారు. దరఖాస్తు
చేసుకోని దేవాలయాల నిర్వహణ ప్రస్తుతం ఉన్నట్టే కొనసాగుతుందన్నారు.
పట్టణాల్లో దేవదాయ శాఖ సత్రాలు, మఠాలు, ఆలయాలకు
సంబందించి అన్యాక్రాతమైన అయిన వాణిజ్య
స్థలాలు, ఇతర ఆస్తుల సమగ్ర వివరాలు సేకరిస్తున్నామని మంత్రి చెప్పారు. ఆ వివరాలతో15 రోజుల్లో
నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దేవదాయ శాఖకు
సంబందించి దాదాపు 4.60 లక్షల ఎకరాల భూమి, 1.65 కోట్ల గజాల వాణిజ్య స్థలం ఆక్రమణలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. అలాంటి భూములను చట్టపరంగా
స్వాధీనం చేసుకునేలా ఆర్డినెన్సు జారీ అయిందని, దాని ప్రకారం చర్యలు
తీసుకుంటామన్నారు.
సనాతన ధర్మం ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని ప్రచారం చేయడానికి ఈ నెల 6న అన్నవరంలో ప్రారంభించినధర్మప్రచార కార్యక్రమం
విజయవంతంగా కొనసాగుతోందని మంత్రి చెప్పారు. ఆగస్టు 14న శ్రీకాళహస్తిలో నిర్వహించామని, తర్వాత వరుసగా కాణిపాకం, విజయవాడ, ద్వారకా తిరుమల, సింహాచలం తదితర దేవాలయాల్లో హిందూధర్మ ప్రచార
కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు