సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రయాన్ 3 పంపిందంటూ ప్రకాశ్‌రాజ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై కొందరు హిందూ సంఘాల నేతలు ఆయనపై బాగల్కోట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. చంద్రయాన్ 3పై వ్యంగ్యంగా ఫోటోలు పోస్ట్ చేసిన ప్రకాశ్‌రాజ్‌పై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
చంద్రయాన్ 3 పంపిన ఫోటో అంటూ ఓ వ్యక్తి లుంగీ కట్టుకుని చాయ్ కలుపుతోన్న ఫోటోను ప్రకాశ్‌రాజ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. వాటిపై ప్రకాశ్‌రాజ్ స్పందిస్తూ ద్వేషంతో చూసే వారికి అంతా ద్వేషమే కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఇది నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోకంటూ ప్రకాశ్‌రాజ్ చెప్పుకొచ్చారు.
తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో ఎవరినీ ఉద్దేశించింది కాదని ప్రకాశ్‌రాజ్ చెప్పారు. మీరు ఏ చాయ్ వాలా గురించి తాను పోస్ట్ చేశాననుకుంటున్నారో అది కాదని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు