ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఇటీవల కలసినప్పుడు పాదాభివందనం చేయడంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
జైలర్ సినిమా విడుదలైన తరవాత రజనీ హిమాలయాలకు వెళ్లిపోయారు. తిరిగి చెన్నై వచ్చే క్రమంలో యూపీ సీఎం యోగీని కలసిన రజనీ పాదాభివందనం చేశారు. దీనిపై రజనీ అభిమానులు ట్రోల్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్, వయసులో చిన్నవారైన సీఎం యోగీకి పాదాభివందనం చేయడం కొందరికి నచ్చలేదు. అలాంటి వారంతా సోషల్ మీడియాలో రజనీపై విమర్శలు గుప్పించారు.
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసిన ట్రోల్స్‌పై తాజాగా రజనీకాంత్ స్పందించారు. తనకు ఎవరైనా స్వాములు కనిపిస్తే వెంటనే పాదాభివందనం చేస్తానని, వారి వయసును పరిగణనలోకి తీసుకోనని వివరణ ఇచ్చారు. దీంతో వివాదానికి తెరపడింది.
రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. పదిరోజుల్లోనే జైలర్ రూ.500 కోట్లు రాబట్టింది. కేవలం పదిరోజుల్లో రూ.500 కోట్ల గ్రాస్ సాధించిన మూడో తమిళ సినిమాగా నిలిచింది.