హర్యానాకు చెందిన ప్రముఖ గాయకుడు రాజు
పంజాబీ, హిసార్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
రాజు పంజాబీ వయసు కేవలం 40ఏళ్ళు మాత్రమే.
రాజు పంజాబీ కొన్నాళ్ళుగా అనారోగ్యంతో
బాధపడుతున్నారని తెలుస్తోంది. పది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.
వెంటిలేటర్ పెట్టవలసి వచ్చేంతగా ఆయన ఆరోగ్యం క్షీణించిపోయిందని స్థానిక మీడియా
వెల్లడించింది.
రాజు పంజాబీ గాయకుడిగా స్థానిక భాషలో
పాటలకు పెట్టింది పేరు. దేశీ దేశీ, అచ్ఛా లగే సే, తూ చీజ్ లాజవాబ్ లాంటి హిట్
సాంగ్స్‌తో యువతను ఆకట్టుకున్నారు. ఈ ఆగస్టు 12న విడుదలైన ‘ఆప్సే మిల్కే యారా
హమ్కో అచ్ఛా లగా థా’, రాజు ఆఖరి పాట.
రాజు కేవలం హర్యానాలోనే కాదు… పంజాబ్,
రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా బాగా పాపులర్ అయిన గాయకుడు. సప్నా చౌదరి వంటి
కళాకారులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చేవారు.
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్,
రాజు మృతికి సంతాపం వ్యక్తం చేసారు. రాజు మరణంతో హర్యానా సంగీత పరిశ్రమకు తీరని
నష్టం వాటిల్లిందని ట్వీట్ చేసారు.