దక్షిణాఫ్రికాలోని జొహానెస్బర్గ్లో
జరగనున్న ‘బ్రిక్స్’ దేశాల సమావేశం కోసం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఉదయం
బయల్దేరి వెళ్ళారు. అక్కడ మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో సమావేశమయే అవకాశముంది.
బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా,
దక్షిణ (సౌత్) ఆఫ్రికా దేశాల కూటమి. 2019 తర్వాత ఈ కూటమి సమావేశం జరగడం ఇదే
మొదటిసారి. కరోనా మహమ్మారి కారణంగా గత మూడేళ్ళూ బ్రిక్స్ సమావేశాలు వర్చువల్‌గానే
జరిగాయి.
ప్రధాని మోదీ ఈ ఉదయం దక్షిణాఫ్రికాకు
బయల్దేరారు. బ్రిక్స్ దేశాలు భవిష్యత్తులో తాము పరస్పరం సహకరించుకోగల,
సహకరించుకోవలసిన అంశాలను గుర్తించడానికి ఇదొక మంచి అవకాశమని మోదీ అన్నారు. ‘‘మొత్తం
దక్షిణార్థ గోళానికి సంబంధించిన అంశాలను చర్చించి, నిర్ణయాలు తీసుకోడానికి
బ్రిక్స్ ఒక గొప్ప వేదికగా నిలుస్తుంద’’ని మోదీ వ్యాఖ్యానించారు.
బ్రిక్స్ వేదికపై భారత్, చైనా దేశాల సంబంధాల
గురించి ఇరుదేశాల్లోనూ ఆసక్తి నెలకొంది. మోదీ, జిన్‌పింగ్ మధ్య చర్చలు జరుగుతాయా
అన్న ప్రశ్నకు ‘మోదీ షెడ్యూల్ ఇంకా తయారవుతోంద’ని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్
క్వాత్రా జవాబిచ్చారు. ‘బ్రిక్స్ విస్తరణ గురించి మేము సానుకూలంగా ఉన్నా’మని కూడా
చెప్పారు.
ఒకవేళ మోదీ, జిన్‌పింగ్
భేటీ జరిగితే… భారత్ చైనా సరిహద్దుల వద్ద ఘర్షణ జరిగిన 2020 మే తర్వాత ఇరుదేశాల
నేతలూ సమావేశమవడం మొదటిసారి అవుతుంది. నిజానికి వారిద్దరూ 2022 నవంబర్‌లో ఇండోనేషియా
బాలిలో ఒకసారి కలిసారు, అయితే అప్పుడు ఎలాంటి చర్చలూ జరగలేదు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు