ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ సహా పలు
జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.
డెహ్రాడూన్, పౌరీ గఢ్వాల్, నైనిటాల్, చంపావత్,
బాగేశ్వర్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక హరిద్వార్, తెహ్రీ,
చమోలీ, ఉద్ధమ్సింగ్ నగర్, పితోరాగఢ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లో పలుచోట్ల
కొండచరియలు విరిగిపడుతున్నాయి, ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో
ఇప్పటివరకూ వర్షాల కారణంగా 52 మంది ప్రాణాలు కోల్పోయారు, 37మంది గాయపడ్డారు.
ఎడతెరిపి లేకుండా
కురుస్తున్న వర్షాలకు ఈ ఉదయం డెహ్రాడూన్లోని ప్రఖ్యాత తపకేశ్వర్ మహాదేవ మందిరం
పాక్షికంగా శిథిలమైంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు