అమెరికాలోని కాలిఫోర్నియాపై హిల్లరీ తుఫాను విరుచుకుపడింది. గంటకు 95 కి.మీ వేగంతో వీస్తోన్న భీకర గాలులు ప్రజలను వణికిస్తున్నాయి. వీటికితోడు కుండపోత వర్షాలతో కాలిఫోర్నియా రాష్ట్రం అతలాకుతలమైంది. పెను గాలులు , కుండపోత వర్షాలు, వరదలతోపాటు…. కాలిఫోర్నియా నగరంలోని ఉత్తర పాంతాన్ని భూకంపం వణికించింది. ఆదివారం చోటు చేసుకున్న ఈ భూకంపం రిక్టరు స్కేలుపై 5.1గా నమోదైంది.
హిల్లరీ తుఫాను ప్రభావంతో కాలిఫోర్నియాను ఎన్నడూ లేని విధంగా వర్షాలు ముంచెత్తాయి. దీంతో కాలిఫోర్నియాలో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదల కారణంగా డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ మూసివేస్తున్నట్టు నేషనల్ పార్క్ సర్వీస్ ప్రకటించింది. ఇలాంటి దారుణమైన వరదలు ఎన్నడూ చూడలేదని కాలిఫోర్నియా మేయర్ కరెన్ బాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వైపు వరదలు ముంచెత్తుతుండగా, మరోవైపు టోర్నడోలు విరుచుకుపడే ప్రమాదముందనే హెచ్చరికలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
హిల్లరీ తుఫానును నాలుగో కేటగిరీ లిస్టులో చేర్చారు. అమెరికాలో పెను తుఫానులను ఐదో కేటగిరీగా వ్యవహరిస్తారు. హిల్లరీ తుఫాను ఆ కేటగిరీకి దగ్గరగా ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని యూఎస్ పెడరల్ మేనేజ్మెంట్ ఏజన్సీ అడ్మినిస్ట్రేటర్ డియానీ క్రిస్వెస్ విజ్ఞప్తి చేశారు. హిల్లరీ తుఫాను ప్రభావం దక్షిణ కాలిఫోర్నియాలో తీవ్రంగా ఉందని ఆ రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ తెలిపారు. రాష్ట్రంలోని దక్షిణాది ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
ప్రజలను వరదల నుంచి రక్షించేందుకు 7500 మంది నేషనల్ గార్డ్స్‌ను రంగంలోకి దించారు. సముద్ర తీర ప్రాంతాలకు సమీపంలోకి కూడా వెళ్ల వద్దని ప్రజలను అధికారులు హెచ్చరించారు. కాలిఫోర్నియాలో స్వోలెన్ నదిలో కారు కొట్టుకుపోవడంతో ఒకరు చనిపోయారని అధికారులు తెలిపారు. బాజా కాలిఫోర్నియాలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, వీటి వల్ల రోడ్లు కూడా మూసుకుపోవచ్చని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటికే 35 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1725 మందిని తరలించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు