ఆసియా
కప్-2023కు భారతజట్టు ఆటగాళ్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ మెగా టోర్నీ కోసం 17
మందితో కూడిన జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
గాయం కారణంగా ఆటకు దూరంగా ఉంటున్న స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, అయ్యర్ ఆసియా కప్
లో ఆడబోతున్నారు. అలాగే టి.20ల్లో అద్భుత
ప్రదర్శనతో ఆకట్టుకున్న హైదరాబాద్ కు
చెందిన తిలక్ వర్మకు చోటు కల్పించారు.
దిల్లీలో
జరిగిన సమావేశంలో మేధోమధననం అనంతరం సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. సమావేశంలో
కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గొన్నారు.
టీ-20లో
రాణిస్తున్న ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణలకు చోటు దక్కింది.
ఇక ఆల్ రౌండర్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, శార్దూల్ జట్టులో ఉండటంతో భారత జట్టు
అత్యంత పటిష్ఠంగా ఉంది.
ఆసియాకప్
జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), హార్థిక్
పాండ్యా(వైస్ కెప్టెన్) శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్
రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్
పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్
యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
శ్రీలంక,
పాకిస్తాన్ వేదికగా హైబ్రిడ్ మోడ్ లో ఆసియాకప్ టోర్నీ జరగనుంది. ఆగస్టు 30న
ముల్తాన్ లో పాకిస్తాన్, నేపాల్ మధ్య మ్యాచ్ తో టోర్నీ ప్రారంభం అవుతుంది.
సెప్టెంబర్ 2న పల్లెకెలె లో దాయాదుల సంగ్రామం జరగనుంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు