జమ్మూ-కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వారిలో లష్కర్ ఎ తయ్యబా సంస్థకు చెందిన టాప్ కమాండర్ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని ఉన్నతాధికారులు తెలిపారు.
లారో పరిగామ్ పరిధిలో ముష్కరుల కదలికపై నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో భద్రతా దళాలు గత రాత్రి నుంచీ గాలింపు చర్యలు చేపట్టాయి. సైన్యంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. రక్షణ బలగాలు కూడా ప్రతిదాడి జరిపి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
రాజౌరీ జిల్లాలో రెండు వారాల కిందట జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. ఆగస్టు 5న కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. గాయపడిన మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు