ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్లో
స్థానికంగా అమిత ప్రఖ్యాతి కలిగిన తపకేశ్వర్ మహాదేవ్ మందిరం భారీ వర్షాల కారణంగా పాక్షికంగా
శిథిలమైంది.
శ్రావణ సోమవారం సందర్భంగా ఈ ఉదయం ఆలయానికి
భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. భారీ వర్షాల కారణంగా ఆలయ ప్రవేశద్వారం ముందు చెట్లు విరిగిపడడంతో
వారు మందిరంలోకి వెళ్ళడానికి అవస్థలు పడ్డారు.
నాలుగు రోజుల క్రితం డెహ్రాడూన్ సమీపంలోని జఖన్
గ్రామంలో కొండచరియలు విరిగిపడి 15 ఇళ్ళు, 7 ఆవుల పాకలూ కూలిపోయాయి. అదృష్టవశాత్తూ
ఎలాంటి ప్రాణాపాయమూ కలగలేదు.
గత వారం రోజులుగా డెహ్రాడూన్ సమీపంలోని కలువలా
ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సాధారణ జనజీవనం అస్తవ్యస్తమయింది.
వీధులన్నీ నీటమునిగాయి, వాననీరు ఇళ్ళలోకి చేరుకుంది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్
ఫోర్స్ సిబ్బంది ప్రజలకు అన్నివిధాలుగా సాయం చేస్తున్నారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
పుష్కర్ ధామీ అంతకుముందు ఏరియల్ సర్వే చేపట్టారు. రిషీకేశ్ వద్ద గంగానది పొంగి
పొర్లుతుండడం, నీటిమట్టాలు పెరిగిపోతుండడంతో వరద పరిస్థితిని సీఎం సమీక్షించారు.
భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి,
ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు