ఐర్లాండ్‌తో డబ్లిన్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ భారత్ సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ 20 మ్యాచ్‌ను భారత జట్టు 33 పరుగుల ఆధిక్యంతో నెగ్గింది. మూడో టీ 20 బుధవారం జరగనుంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది.భారత జట్టులో రుతురాజ్ గైక్వాడ్ 43 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో మొత్తం 58 పరుగులు చేశారు. సంజు శాంసన్ 40, రింకూ సింగ్ 38 పరుగులతో రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో మెకార్తి 2 వికెట్లు తీశాడు. తరవాత బ్యాటింగ్ చేపట్టిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేశారు. ఐర్లాండ్ జట్టులో ఆండీ బాల్బిర్నీ 72 పరుగులు చేశారు. భారత్ బౌలర్లు బుమ్రా 2, ప్రసిద్ధ్ కృష్ణ 2, రవి బిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టారు.
ఐర్లాండ్ జట్టులో బాల్బిర్నీ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. తొలి రెండు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 18 పరుగులు చేశారు. ప్రారంభంలో మెరిసినా వరుసగా వికెట్లు తీయడంతో బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. భారత్ బౌలర్ ప్రసిద్ధ్ ఒకే ఓవర్లో స్టిర్లింగ్, టకర్‌ను డక్ ఔట్ చేశాడు. షార్ట్ పిచ్ కావడంతో ఐర్లండ్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో రెండో టీ20ని టీమిండియా చేజిక్కించుకుంది. మూడో మ్యాచ్ కూడా గెలిచి వైట్‌వాష్ చేయాలని భారత్ భావిస్తోంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు