ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్భణం పెరిగిపోవడంతో ధరల నియంత్రణలో భాగంగా కేంద్రం పలు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే సన్నబియ్యం ఎగుమతులను నిషేధించింది. ఇక టొమాటో ధరలు కూడా దిగి వచ్చాయి. అయితే గత నెల రోజులుగా ఉల్లి ధరలు 18 శాతం పెరగడంతో, వాటి ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై 40 శాతం పన్ను విధించింది. ఉల్లి ఎగుమతులపై పన్నులు భారీగా పెంచడం ద్వారా దేశం నుంచి ఉల్లి బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంది.
దేశంలో చాలా ప్రాంతాల్లో కిలో ఉల్లి రూ.33 నుంచి రూ.40 మధ్య పలుకుతోంది. అయితే కేంద్రం వద్ద అందుబాటులో ఉన్న 3 లక్షల టన్నుల బఫర్ నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించింది. ఇప్పటికే కేంద్రం వద్ద నిల్వ ఉంచిన బఫర్ ఉల్లి నిల్వలను వేలం వేసి మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. దీని ద్వారా రాబోయే కొద్ది రోజుల్లో కిలో ఉల్లి ధరను రూ.25 వద్ద అందుబాటులో ఉంచాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు