చంద్రయాన్
-3 వ్యోమనౌక లక్ష్యానికి అత్యంత సమీపంగా వెళ్లింది. మూడురోజుల్లో అద్భుతఘట్టం
సాకారం కాబోతుంది. ఆగస్టు 23, సాయంత్రం
6.04 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండర్ విక్రమ్ అడుగుమోపుతుందని ఇస్రో తెలిపింది. ఈ
ఘనత సాధిస్తే చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగోదేశంగా భారత్ రికార్డు
నెలకొల్పబోతుంది. అమెరికా సంయుక్తరాష్ట్రాలు, రష్యా, చైనా తర్వాతి స్థానంలో మనదేశం
చేరబోతుంది.
ల్యాండర్
సాఫ్ట్ ల్యాండింగ్‌కు సంబంధించిన లైవ్ ఏర్పాట్లు చేసినట్లు ఇస్రో తెలిపింది.
దేశవ్యాప్తంగా ఈ అద్భుత ఘట్టాన్ని వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించే అవకాశాన్ని
కల్పించింది. ఇస్రో వెబ్సైట్ తో పాటు
యూట్యూబ్ చానల్, ఫేస్బుక్ లైవ్ ద్వారా స్పేస్‌క్రాఫ్ట్ విన్యాసాలు చూడవచ్చు.
విద్యాసంస్థలు ఈ ప్రక్రియను లైవ్ టెలీకాస్ట్ చేయడం తద్వారా బోధనా సిబ్బంది,
విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని ఎక్స్ వేదికగా ఇస్రో కోరింది.