మధ్యప్రదేశ్
ప్రగతిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా.. 50 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో
మధ్యప్రదేశ్ ‘బిమారు’ రాష్ట్రంగా మారిందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్కు దమ్ముంటే
తన 50 ఏళ్ళ పాలనపై నివేదిక విడుదల చేయాలని సవాలు చేసిన బీజేపీ అగ్రనేత, రాజకీయాల్లో
జవాబుదారీతనాన్నీ పరిచయం చేసింది తమ పార్టీనే అన్నారు.
ఆ
రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ .. కరప్షన్ చీఫ్ గా మారారని దుయ్యబట్టిన అమిత్
షా.. రాష్ట్రంలో 53 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలక పార్టీగా ఉన్నప్పటికీ ఎలాంటి మేలు
జరగకపోగా తీవ్రమైన నష్టం వాటిల్లిందన్నారు.
ప్రధాని
మోదీ, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు
కుట్రలు చేశారని ఘాటు విమర్శలు చేశారు. కాషాయపార్టీ పాలన మధ్యప్రదేశ్ కు
స్వర్ణయుగంగా అభివర్ణించిన అమిత్ షా.. గత 20 ఏళ్ల పాలనలో ఎన్నో అద్భుతాలు
చేయగల్గిందని వివరించారు. పేదరికాన్నిరూపుమాపడంతో మధ్యప్రదేశ్ ను అభివృద్ధి చెందిన
రాష్ట్రాల సరసన నిలబెట్టేందుకు బీజేపీ పాలన దోహదం చేసిందన్నారు. స్వావలంబన దిశగా
అడుగులు లేస్తుందన్నారు. పరిశ్రమలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో స్వయం
సమృద్ధి సాధించే దిశగా బీజేపీ పనిచేస్తోందన్నారు.
మధ్యప్రదేశ్
కు 2004- 2014 మధ్య కాలంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రూ.
1,98,000 కోట్లు విడుదల చేస్తే.. మోదీ
ప్రభుత్వం రూ.8,33,000 కోట్లు అందజేసిందని వివరించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు