కేంద్రంలోని
పాలక NDA కూటమికి వ్యతిరేకంగా జతకట్టిన విపక్ష
కూటమి I.N.D.I.A లో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి.
మిత్రధర్మం మరిచి పరస్పర విమర్శలకు దిగుతున్నారు. విపక్షాల ఐక్యత మూణ్ణా ళ్ళ
ముచ్చటే అన్నట్లుగా ఉంది. ఎవరు ఎప్పుడు కూటమికి వీడ్కోలు చెబుతారో తెలియని
పరిస్థితి నెలకొంది.
ఓ వైపు శరద్ పవార్ వంటి అగ్రనేత కూటమి నుంచి
వైదొలిగి ఎన్డీయే లో చేరతారనే వార్తల చక్కర్లు కొడుతున్న సమయంలోనే ఆప్ అధినేత I.N.D.I.Aలో ఉంటూనే అందులో ప్రధాన భాగస్వామ్య
పార్టీగా ఉన్న కాంగ్రెస్ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. దిల్లీలోని ఏడు ఎంపీ సీట్ల ఎన్నికల సన్నాహాల్లో
కాంగ్రెస్ మునిగిపోవడంపై చిర్రెత్తిపోయిన ఆప్ కూటమిలో కొనసాగడంపై తాడోపేడో తేల్చుకునేందుకు
సిద్ధమైంది.
ఛత్తీస్గఢ్ ్
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పాలనలోని లొసుగులను కేజ్రీవాల్ ఎండగట్టారు. కాంగ్రెస్
పాలనలో ఛత్తీస్గఢ్ లోని ప్రభుత్వ స్కూళ్లు అధ్వానంగా ఉన్నాయని విమర్శించిన ఆప్
అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్, స్వాతంత్ర్యం సిద్ధించిన 76 ఏళ్లలో ఆప్ మినహా ఏ
ఒక్క పార్టీ కూడా బడులు, ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించలేకపోయిందన్నారు. మిగతా
పార్టీల్లా ఆదాయార్జన కోసం తాము రాజకీయాలు చేయడం లేదని విమర్శించారు. దిల్లీలోని
ప్రభుత్వ స్కూళ్లతో ఛత్తీస్గఢ్ లోని పాఠశాలలను పోల్చారు. కాంగ్రెస్ పాలన అత్యంత
పేలవంగా ఉందని మిత్రపక్షానికి చురకలు అంటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత
విద్యుత్ తో పాటు మహిళలకు నెలకు రూ. 3వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. దిల్లీ,
పంజాబ్ లో హామీలు అమలు చేసినట్లే అధికారంలోకి వస్తే ఛత్తీస్గఢ్ లో వాగ్దానాలు
నెరవేరుస్తామన్నారు. మిగతా పార్టీల్లా అసత్య వాగ్దానాలు వల్లె వేయడం లేదన్నారు.
ఎన్నికల
ప్రచారంలో భాగంగా పది వాగ్దానాలు చేసిన ఆప్.. అధికారంలోకి వస్తే 24 గంటల పాటు
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు 300 యూనిట్ల వరకు ఉచితంగా
అంబదజేస్తామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపడతామన్నారు. అందరికీ
మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు