జమ్మూ కశ్మీర్‌లోని లద్దాక్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది సైనికులు చనిపోయిన సంగతి తెలిసిందే. 10 మంది సైనికులతో కూడిన వాహనం లేహ్ నయోమా ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా పట్టుతప్పి భారీ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జవానుకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం 9 మంది సైనికులు చనిపోయారు. వారిలో నయీబ్ సుబేదార్ రమేష్ లాల్, హవల్దార్ విజయ్ కుమార్, నాయక్ చంద్రశేఖర్,లాన్స్ నాయక్ తేజ్ పాల్, సిపాయి తరన్దీప్ సింగ్, హవల్దార్ మహేంద్రసింగ్, సిపాయి మన్మోహన్, అంకిత్ కుండు, బియోటీ వైభవ్ ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా ప్రగాఢ సంతాపం ప్రకటించారు. లేహ్ ప్రమాదంలో మరణించిన సైనికుల సేవలను జాతి ఎప్పటికీ మరవదని ప్రధాని మోదీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు