దిల్లీ
ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి స్నేహితుడి కుమార్తెపై లైంగికదాడికి పాల్పడినట్లు ఫిర్యాదు
అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రి చనిపోయిన ఓ 14 ఏళ్ల బాలికకు ఆశ్రయం
కల్పించిన సదరు అధికారి కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడినట్ల్లు ఎఫ్ఐఆర్ లో
పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారిపై పోస్కో చట్టంతో పాటు పలు
సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ కేసులో సదరు అధికారి భార్య
ప్రమేయం కూడా ఉందని తేలడంతో ఆమెపై కూడా పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు.
‘‘ప్రస్తుతం
12వ తరగతి చదువుతున్న బాలిక 2020లో తండ్రిని కోల్పోయింది. దీంతో తండ్రి
స్నేహితుడైన నిందితుడు బాలికను తన ఇంటికి తీసుకెళ్లి పలు సార్లు లైంగికదాడికి
పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చగా విషయాన్ని భార్యకు చెప్పాడు. ఆమె తన కుమారుడి
ద్వారా అబార్షన్ పిల్స్ తెప్పించి ఇంటి వద్దే గర్భ విచ్ఛిత్తి చేసినట్లు
బాధితురాలు పోలీసులకు తెలిపింది.
బాధిత
బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మేజిస్ట్రేట్ ముందు ఆమె
వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు