కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ గూటికి చేరుతున్నారు. ఇవాళ ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో యార్లగడ్డ కలసి మంతనాలు జరిపారు. ఈ నెల 22న గన్నవరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నారు. 2014లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ చేతిలో ఓటమి పాలయ్యారు. తరవాత టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరడంతో అక్కడ ఇరు వర్గాల మధ్య పోరు మొదలైంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీ చేస్తారంటూ ఆ పార్టీ నేతలు తేల్చి చెప్పడంతో ఇక యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
గన్నవరంలో గత ఆరేళ్లుగా వైసీపీకి అండగా నిలిచిన యార్లగడ్డ వెంకట్రావు ఆ పార్టీని వీడటం పెద్ద లోటుగా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పేరు దాదాపుగా ఖరారైందనే వార్తలు వస్తున్నాయి.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు