వన్డే
ప్రపంచకప్-2023 కు కౌంట్‌డౌన్ దగ్గర పడుతున్న కొద్దీ ఐసీసీ, బీసీసీఐలకు కొత్త
సమస్యలు ఎదురవుతున్నాయి. షెడ్యూల్ మార్పు కోరుతూ అభ్యర్థనలు అందుతున్నట్లు తెలుస్తోంది.
భారత్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నమెంట్ కు ఇంకా 46 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
వారం రోజుల్లో టికెట్ల విక్రయానికి కూడా బీసీసీఐ సిద్ధం అవుతోంది. ఇంతలోనే
షెడ్యూల్ మార్పుపై ఆలోచించాలంటూ బీసీసీఐని హెచ్‌సీఏ కోరింది.
వరల్డ్‌కప్
కొత్త షెడ్యూల్ ప్రకారం, హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 9న న్యూజిల్యాండ్,
నెదర్లాండ్స్ తలపడనున్నాయి. మరుసటి రోజు అంటే అక్టోబర్ 10న పాకిస్తాన్, శ్రీలంక
మధ్య మ్యాచ్ ఉంటుంది. ఇలా వరుస మ్యాచ్‌లకు భద్రత కల్పించడం కష్టమని పోలీసులు
తెలపడంతో అదే విషయాన్ని హెచ్‌సీఏ, బీసీసీఐకి నివేదించిందట.
పాకిస్తాన్,
శ్రీలంక మ్యాచ్ అక్టోబర్ 12న జరగాల్సి ఉన్నప్పటికీ ఐసీసీ షెడ్యూల్ మార్చడంతో రెండు
రోజులు ముందుకు జరిగాల్సి వచ్చింది. ఇప్పటికే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్, బెంగాల్
క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ లో ఐసీసీ స్వల్ప
మార్పులు చేసింది. ప్రస్తుతం హెచ్‌సీఏ నుంచి అందిన లేఖపై ఎలా స్పందిస్తుందో వేచి
చూడాలి
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు