మాజీ
ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
రాజీవ్ 79వ జయంతి సందర్భంగా ..ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా అంజలి ఘటించారు.
కాంగ్రెస్
నేత రాహుల్ గాంధీ కూడా ఆయన తండ్రి రాజీవ్ దేశానికి అందించిన సేవలు గుర్తుచేసుకున్నారు.
లడాఖ్ పర్యటనలో పాంగాంగ్ సరస్సును సందర్శించిన రాహుల్ .. అక్కడే తన తండ్రి ఫొటోకు
నివాళులు అర్పించారు. పాంగాంగ్ తో రాజీవ్ కు ఉన్న అనుబంధాన్ని తెలుపుతూ పలు ఫొటోలు
షేర్ చేశారు.
‘‘
నాన్నా. భారత్ కోసం మీరెన్నో కలలు కన్నారు. మీరు చూపిన మార్గంలో నడుస్తూ, ప్రతి
భారతీయుడి కష్టాలను అర్థం చేసుకుంటా.. భరతమాత గొంతును వింటున్నాను’’ అని రాహుల్
ఎక్స్ వేదికగా భావోద్వేగ సందేశం రాశారు. ప్రకృతి
అందాల గురించి తండ్రి చెప్పిన విషయాలు గుర్తుచేసుకున్న రాహుల్.. భూమిపై ఉన్న
అత్యంత సుందరమైన ప్రదేశాల్లో లడాక్ ఒకటన్నారు.
అంతకు
ముందు స్పోర్ట్స్ బైక్ ను డ్రైవింగ్ చేస్తూ అత్యంత ఉల్లాసంగా గడిపారు.
దేశానికి సేవలందించిన ప్రధానమంత్రుల్లో రాజీవ్
గాంధీ అత్యంత పిన్న వయస్కులు. ఎన్నికల ప్రచారంలో బాగంగా 1991లో తమిళనాడులోని శ్రీపెరంబదూర్
లో పర్యటిస్తున్న రాజీవ్‌ను ఎల్టీటీఈకు చెందిన ఆత్మాహుతి దళం హత్య చేసింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు