చంద్రయాన్
-3 లో కీలకఘట్టం పూర్తియింది. చివరి బూస్టింగ్ ను విజయవంతంగా పూర్తిచేసినట్లు
ఇస్రో తెలిపింది. చంద్రుడి నుంచి అత్యల్పంగా 25కిలోమీటర్లు, అత్యధికంగా
134కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్ పరిభ్రమిస్తోంది. ఈ కీలక ప్రయాణం
పూర్తియితే చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్ దిగుతుంది.
విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ పై శాస్త్రవేత్తలు
దృష్టిపెట్టారు. ఎంచుకున్న ల్యాండింగ్ సైట్ లో సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నామని
చంద్రుడిపై అడుగుపెట్టే ప్రక్రియ ఆగస్టు 23న సాయంత్రం 5.45 నిమిషాలకు ప్రారంభం
అవుతుందని ఇస్రో తెలిపింది.