డిజిటల్
పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఎకానమీ, డిజిటల్ స్కేలింగ్ భారత్ ప్రాధాన్య
అంశాలని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న జీ-20
డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూపు మంత్రుల సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి అశ్విని
వైష్ణవ్, .. భారత ప్రాధాన్యాంశాలు ప్రధాని మోదీవిశాల థృక్పదానికి నిదర్శమన్నారు.
అందరికీ
విశ్వాసం, రక్షణ, సమానత్వం పెంపొందించేలా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడమే
భారత్ అజెండా అని వివరించారు. సాంకేతిక
పరిజ్ఞానం విస్తృతీకరణను ప్రధాని నమ్ముతారన్న కేంద్రమంత్రి వైష్ణవ్.. ఎన్నో ఆవిష్కరణలకు
బెంగళూరు పుట్టినిల్లు అని కొనియాడారు. ప్రపంచప్రఖ్యాత టెక్ కంపెనీల కార్యకలాపాలకు
నిలయంగా మారిన విషయాన్ని గుర్తు చేశారు.
డిజిటల్
ఎకానమీ వృద్ధికి అనేక దేశాలు సహకరించుకోవడానికి జి-20 సమావేశం దోహదం చేస్తుందన్నారు. చర్చల ద్వారా
సమస్యలకు వినూత్న పరిష్కారాలు, సహకార వ్యూహాల గురించి తెలుసుకోవచ్చు అని
అభిప్రాయపడ్డారు.
అంతకు
ముందు డిజిటల్ ఎకానమీ పై ప్రసంగించిన ప్రధాని మోదీ, భారత్ లో 85 కోట్ల మంది ఇంటర్నెట్
వినియోగిస్తున్నరని, ప్రపంచదేశాల కంటే అత్యంత చౌక ధరకే అందజేస్తున్నట్లు తెలిపారు. జన్
ధన్ అకౌంట్లు, ఆధార్, మొబైల్ వాడకంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నట్లు
వివరించిన ప్రధాని మోదీ.. ప్రతినెలా యూపీఐల
ద్వారా పదిబిలియన్లలావాదేవీలు
జరుగుతున్నాయని వెల్లడించారు. వీటిలో 45
శాతం గ్లోబల్ రియల్ టైమ్ పేమెంట్లు ఉన్నాయని చెప్పారు. టెక్నాలజీని భారత్
అందిపుచ్చుకుందని చెప్పడానికి ఆదే నిదర్శనమన్నారు. పన్నుల వ్యవస్థ ప్రక్రియను
డిజిటలైజేషన్ చేయడంతో పారదర్శకత పెరిగిందన్నారు.