తోషఖానా అవినీతి కేసులో జైల్లో ఉన్న తన భర్త, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై విష ప్రయోగం చేసి చంపేస్తారని భయంగా ఉందంటూ ఆయన భార్య బుష్రా బీబీ ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ అటక్ జైలులో ఇమ్రాన్ ఖాన్ ఖైదీగా ఉన్నారు. తన భర్తను మంచి సదుపాయాలున్న జైలు తరలించాలని బుష్రా బీబీ పంజాబ్ హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఇమ్రాన్ ఖాన్‌ను రావల్పిండిలోని అదియాలాకు తరలించాలని అధికారులను కోర్టు ఆదేశించినట్టు ఆమె తెలిపారు.
సరైన కారణాలు లేకుండానే ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో బంధించారని బుష్రా బీబీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్‌పై గతంలోనే రెండుసార్లు హత్యాప్రయత్నాలు జరిగినా, సంబంధిత వ్యక్తులను ఇంత వరకు అరెస్టు చేయలేదని ఆమె గుర్తుచేశారు. అటక్ జైలులో ఇమ్రాన్‌పై విష ప్రయోగం జరిగే అవకాశముందని ఓ వార్తాసంస్థకు బుష్రా చెప్పారు. ఇంటి నుంచి పంపిన ఆహారాన్ని ఇమ్రాన్‌కు ఇచ్చేలా అనుమతి ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. జైలులో ఇటీవల ఇమ్రాన్ ఖాన్‌ను కలసిన బుష్రా అక్కడి పరిస్థితులను మీడియాకు వెల్లడించారు. జైల్లో సరైన సదుపాయాలు లేవన్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు విధించిన శిక్షను సవాల్ చేస్తూ దాఖలు చేసిన కేసు ఈ నెల 22న విచారణకు రానుంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు