స్టాఫ్
సెలక్షన్ కమిషన్ (SSC) వివిద ఉద్యోగపరీక్షల క్యాలెండర్ ను ప్రకటించింది. ఈ
ఏడాదిలో నిర్వహించే CGL,
CHSL, JE, PO
పరీక్షల వివరాలు వెల్లడించింది.అక్టోబర్,
నవంబర్, డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది.
కంబైన్డ్
గ్రాడ్యూయేట్ లెవల్(CGL) పరీక్షను అక్టోబర్ 25, 26, 27 న
నిర్వహిస్తున్నట్లు అధికారిక వైబ్సైట్ లో పేర్కొంది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ పరీక్షను నవంబర్ 2న నిర్వహించనుంది.
జూనియర్
ఇంజినీర్ పోస్టుల నియామకానికి సంబంధించిన పరీక్షను డిసెంబర్ 4న, సబ్ ఇన్సెపెక్టర్
ఆఫ్ దిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కు చెందిన పరీక్ష డిసెంబర్ 22న ఉంటుందని
తెలిపింది. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ను సందర్శించాలని కోరింది.