దేశీయంగా
తయారైన తొలి హైడ్రోజన్ బస్సు, ట్రయల్స్ కు సిద్ధమైంది. సముద్ర మట్టానికి అత్యంత
ఎత్తులో ఉండే లద్ధాఖ్ లో మూడునెలల పాటు ఈ సర్వీసు నడపనున్నారు. ఆగస్టు 15న సర్వీసు
ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ కొండచరియలు విరిగిపడిన ఘటనతో వాయిదా పడింది.
హైడ్రోజన్
ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి సంస్థ NTPC అశోక్ లేల్యాండ్ తో కలిసి ఈ బస్సులకు
రూపకల్పన చేసింది. ఒక్కో బస్సు ఖరీదు రూ. 2.5 కోట్లు. మొత్తం ఐదు బస్సులను
రూపొందించిన ఎన్టీపీసీ, లేహ్ అడ్మినిస్ట్రేషన్ కు అప్పగిస్తోంది. హైడ్రోజన్ ను ఈ
బస్సులకు ఇందనంగా ఉపయోగిస్తారు. లేహ్ లో ఇప్పటికే రీఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు
చేసిన ఎన్టీపీసీ, 1.7 మోగావాట్ల సోలార్ ప్లాంట్ ను కూడా నిర్మించింది. ట్రయల్ రన్
సందర్భంగా నష్టాలు వాటిల్లితే వాటిని కూడా ఈ సంస్థే భరిస్తుంది.