ప్రభుత్వ భూమికి కబ్జా చేయడమే కాకుండా అందులో అక్రమంగా చర్చి నిర్మించడంపై హైందవశక్తి న్యాయపోరాటం ప్రారంభించింది. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం, కోగంటివారిపాలెం నుంచి అంబడిపూడి వెళ్లే రోడ్డు వెంట పంట కాలువ భూములను కొందరు ఆక్రమించి అందులో చర్చి నిర్మిస్తున్నారని హైందవశక్తి గుర్తించింది. ఈ నిర్మాణాలపై హైందవశక్తి హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు స్టే విధించింది. అయినా అక్కడ అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగలేదు. దీనిపై కోర్టు దిక్కరణ పిటీషన్ వేసేందుకు హైందవ శక్తి నాయకులు సిద్దమవుతున్నారు.
కోగంటివారిపాలెం రెవెన్యూలో కాలువ భూమి, ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మిస్తోన్న చర్చి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కొందరు
అక్రమార్కులు పరిశుద్ధ భోజప్ప దేవాలయం పేరుతో విదేశీ నిధులు తీసుకువచ్చి చర్చి నిర్మాణం చేయడాన్ని హైందవశక్తి గుంటూరు జిల్లా అధ్యక్షుడు కాకర్ల వీరేంద్రకుమార్
స్పందనలో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో తాత్కాలికంగా చర్చి నిర్మాణం నిలిపివేశారు. తరువాత మరలా చర్చి నిర్మాణం ప్రారంభించారు. దీంతో హైందవశక్తి
హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. కోర్టు స్టే ఆర్డరును కాదని, చర్చి నిర్మాణం కొనసాగిస్తున్నారు. దీంతో కోర్టు దిక్కరణ పిటీషన్ వేసేందుకు హైందవశక్తి సిద్దం అవుతోంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు