జైలర్
మూవీని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ అదిత్యానాథ్ వీక్షించనున్నారు. సినిమాలో ప్రధాన
పాత్రదారుడైన సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి యోగీ థియేటర్ కు వెళ్లనున్నారు.
ఇప్పటికే ఈ సినిమాను తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వీక్షించగా,
తాజా యూపీ సీఎం యోగీ కూడా చూడబోతున్నారు.
జైలర్
హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో రజినీకాంత్ ఆలయాల సందర్శనకు వెళ్లారు. తిరుగుప్రయాణంలో
భాగంగా నిన్న రాత్రి లక్నో చేరుకున్నారు. ఇవాళ సీఎం యోగీ అధిత్యనాథ్ తో కలిసి
జైలర్ చూడబోతున్నారు. ఈ విషయాన్ని రజినీకాంతే మీడియాకు తెలిపారు. అయితే వీరిద్దరి
కలయిక రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. రజినీకాంత్ బీజేపీలో చేరికపై చర్చ జరిగే
అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నెల్సన్
దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ మూవీ .. ఆగస్టు 10న విడుదలై భారీ విజయం
సాధించింది. ఈ చిత్రంలో దక్షిణాది నటులతో పాటు పలువురు బాలీవుడ్ నటులు కూడా
నటించారు. ఇప్పటికే రూ. 450 కోట్ల రూపాయలు మేర వసూలు చేసింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు